జనసేనలో ముగ్గురికి పదవులు | three positions for janasena party : pavan kalyan | Sakshi
Sakshi News home page

జనసేనలో ముగ్గురికి పదవులు

Nov 6 2016 2:59 AM | Updated on Mar 22 2019 5:33 PM

జనసేనలో ముగ్గురికి పదవులు - Sakshi

జనసేనలో ముగ్గురికి పదవులు

జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారించామని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి: పవన్ కల్యాణ్

 సాక్షి, హైదరాబాద్: జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారించామని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. జనసేన ఆవిర్భావ సమయంలో ఉపాధ్యక్షుడిగా పనిచేసిన మహేం దర్‌రెడ్డిని తెలంగాణ జనసేన రాజకీయ కార్యక్రమాల సమన్వయకర్తగా నియమించినట్లు ప్రకటించారు. తెలంగాణ ఇన్‌చార్జిగా నేమూరి శంకర్‌గౌడ్, మీడియా విభాగం అధ్యక్షుడిగా సీనియర్ పాత్రికేయుడు పి.హరిప్రసాద్‌ను నియమించారు. ఈ మేరకు పవన్ శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. మహేందర్‌రెడ్డి రంగారెడ్డి జిల్లా డి.పోచంపల్లికి చెందిన వ్యాపారవేత్త. బోరబండకి చెందిన శంకర్‌గౌడ్ కామన్‌మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్‌లో చురుకైన కార్యకర్తగా పనిచేశారని అందులో తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement