టీఆర్ఎస్ నేతకే టోకరా | Three men tried to cheat TRS Leader | Sakshi
Sakshi News home page

టీఆర్ఎస్ నేతకే టోకరా

Nov 29 2015 6:43 PM | Updated on Sep 4 2018 5:07 PM

టీఆర్ఎస్ నేతకే టోకరా - Sakshi

టీఆర్ఎస్ నేతకే టోకరా

టీఆర్ఎస్ నేత పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డికి టోకరా ఇచ్చేందుకు ప్రయత్నించి అరెస్టైన ముగ్గురు మోసగాళ్లు.

టీఆర్ఎస్ నేతకే టోకరా వేసేందుకు ప్రయత్నించారు ముగ్గురు కేటుగాళ్లు.. కేంద్ర ప్రభుత్వ పధకం కింత నిధులు మంజూరు చేయిస్తామంటూ.. ఏకంగా.. టీఆర్ఎస్ సీనియర్ నేత పెద్ది రెడ్డి సుదర్శన్ రెడ్డకి ఫోన్ చేశారు. ఆయన అప్రమత్తం కావడంతో అడ్డంగా దొరికి పోయారు.

వివరాల్లోకి వెళితే.. ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ లో డిప్యూటీ డైరెక్టర్ ని అంటూ వరంగల్ జిల్లా నర్సంపేట నియోజక వర్గం టీఆర్ఎస్ ఇన్ చార్జి పెద్ది రెడ్డి సుదర్శన్ రెడ్డికి ఈనెల 26న గుర్తుతెలియని వ్యక్తి పోన్ చేశాడు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రాం(పీఎమ్‌ఈజీపీ) పథకంలో నిధులు మంజూరు చేస్తున్నారని చెప్పాడు.

మీ నియోజకవర్గంలో ఈ పధకం కోసం రూ.2కోట్లను మంజూరు చేయిస్తానని నమ్మించాడు. ఈ నిధులు మంజూరు కావాలంటే రూ.50వేలు అడ్వాన్స్‌గా చెల్లించాల్సి ఉంటుందని, రూ.50వేలను ఎస్‌బీఐ అకౌంట్ నెంబర్ 30976640437 లో జమచేయాలని సూచించారు. దీంతో అనుమానం వచ్చిన సుదర్శన్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోన్ నంబర్ ఆధారంగా పోలీసులు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement