కిడ్నీ రాకెట్ కేసులో మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. చెన్నై కేంద్రంగా కిడ్నీ రాకెట్ కార్యకలాపాలు సాగిస్తోంది.
హైదరాబాద్ : కిడ్నీ రాకెట్ కేసులో మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. చెన్నై కేంద్రంగా కిడ్నీ రాకెట్ కార్యకలాపాలు సాగిస్తోంది. ప్రధాన నిందితుడి కోసం ప్రత్యేక బృందం చెన్నైకి వెళ్లింది. అరెస్ట్ చేసిన ముగ్గురు నిందితులను ఈరోజు సాయంత్రం మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. కాగా శ్రీలంక రాజధాని కొలంబోలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన దినేష్ ఘటనలో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. పక్కా క్లూ లభించడంతో నిందితులను పట్టుకునేందుకు రెండు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు సీసీఎస్ డీసీపీ పాల్‌రాజు తెలిపారు.
కాగా కొలంబోలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వైద్యులు దినేష్ పోస్టుమార్టం నివేదికలో అతనిది సాధారణ మరణం (గుండెపోటు) అని వెల్లడించారు. కిడ్నీ మార్పిడి జరుగుతున్న సమయంలో గుండెపోటు వచ్చి చనిపోయాడా లేక ఆపరేషన్‌కు ముందే గుండెపోటు వచ్చి చనిపోయాడా అనే విషయాలు ఆ నివేదికలో డాక్టర్లు పేర్కొనలేదని పాల్‌రాజు తెలిపారు.