ఏపీ ప్రభుత్వ అభ్యంతరాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని తెలంగాణ నీటి పారుదలశాఖ మంత్రి హరీష్‌రావు కర్ణాటక నీటి పారుదల శాఖ మంత్రి ఎంబీ పాటిల్‌ను కోరారు.
ఏపీ ప్రభుత్వ అభ్యంతరాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని తెలంగాణ నీటి పారుదలశాఖ మంత్రి హరీష్‌రావు కర్ణాటక నీటి పారుదల శాఖ మంత్రి ఎంబీ పాటిల్‌ను కోరారు. శుక్రవారం ఉదయం ఆయన ఎంబీ పాటిల్‌కు ఫోన్ చేశారు. ఆర్డీఎస్ పనులను నిలిపివేయకుండా కొనసాగించాలని కోరారు. కర్నూలు జిల్లా అధికారుల అభ్యంతరాలను పట్టించుకోవద్దని సూచించారు. బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం తెలంగాణకు రావల్సిన సాగు నీటి వాటా అందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.