వచ్చే ఎన్నికల్లో బీసీలకే మేయర్ పీఠం | The mayor's seat in the next elections bisilake | Sakshi
Sakshi News home page

వచ్చే ఎన్నికల్లో బీసీలకే మేయర్ పీఠం

Mar 2 2014 5:52 AM | Updated on Sep 2 2017 4:16 AM

వచ్చే ఎన్నికల్లో బీసీలకే మేయర్ పీఠం

వచ్చే ఎన్నికల్లో బీసీలకే మేయర్ పీఠం

హైదరాబాద్ నగర 25వ మేయర్‌గా బీసీ అభ్యర్థి రానున్నారు. వచ్చే నవంబర్-డిసెంబర్‌లో జరుగనున్న ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని బీసీ అభ్యర్థి అధిష్టించనున్నారు.

సిటీబ్యూరో, న్యూస్‌లైన్: హైదరాబాద్ నగర 25వ మేయర్‌గా బీసీ అభ్యర్థి రానున్నారు. వచ్చే నవంబర్-డిసెంబర్‌లో జరుగనున్న ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని బీసీ అభ్యర్థి అధిష్టించనున్నారు. ఆయా కార్పొరేషన్ల మేయర్ల రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం శనివారం జీవో జారీ చేసింది. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) మేయర్ పదవిని బీసీ- జనరల్‌కు కేటాయించింది.

వచ్చే ఎన్నికల్లో బీసీలను ఈ పదవి వరించనుండటంతో ప్రస్తుత బీసీ కార్పొరేటర్లలో ఉత్సాహం పెల్లుబుకుతోంది. డెబ్బై లక్షలకు పైగా జనాభా ఉన్న గ్రేటర్‌కు మేయర్‌గా వ్యవహరించే అవకాశం రానున్నందున.. బీసీ వర్గాలు ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నాయి. గతంలో మేయర్‌ను నేరుగా ప్రజలే ఎన్నుకునేవారు. జీహెచ్‌ఎంసీ ఏర్పాటైనప్పటి నుంచి పరోక్ష పద్ధతిలో (గెలిచిన కార్పొరేటర్లనుంచి) ఎన్నుకుంటున్నారు.

జీహెచ్‌ఎంసీ ఆవిర్భావం అయ్యాక తొలిసారిగా ఓసీ- జనరల్‌కు అవకాశం లభించింది. కాంగ్రెస్- ఎంఐఎం కూటమి ఒప్పందం మేరకు ఇద్దరికి అవకాశం లభించింది. కాంగ్రెస్ నుంచి బండ కార్తీకరెడ్డి తొలి రెండేళ్లు మేయర్‌గా పనిచేయగా.. ఆమె తర్వాత మాజిద్ 24వ మేయర్‌గా పదవిలో కొనసాగుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement