గుండె నొప్పితో బాధపడుతున్న ఓ మహిళ ఖైదీ ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది.
చికిత్సపొందుతూ మహిళా ఖైదీ మృతి
Sep 3 2017 5:19 PM | Updated on Sep 12 2017 1:46 AM
సాక్షి, హైదరాబాద్: గుండె నొప్పితో బాధపడుతున్న ఓ మహిళ ఖైదీ ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. చంచల్‌గూడ మహిళ జైలు సూపరింటెండెంట్ బషీరా బేగం తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా అంకిల్లా గ్రామానికి చెందిన పండ్ల నాగమ్మ(45) ఓ మహిళను హత్య చేసిన కేసులో దోషిగా తేలింది. దీంతో 2011 లో కోర్టు ఆమెకు జీవిత ఖైదు శిక్ష విధించింది. అప్పటి నుంచి ఆమె హైదరాబాద్ చంచల్‌గూడలోని మహిళ జైల్లో శిక్ష అనుభవిస్తుంది.
గతంలో ఆమె టీబీ వ్యాధికి గురై 8 నెలల పాటు చికిత్స పొంది ఆరోగ్యంగానే ఉంది. తాజాగా ఆదివారం ఉదయం నాగమ్మకు అకస్మాత్తుగా చాతీలో నొప్పి రాగా జైలు వైద్యులు ప్రాథమిక చికిత్స అందించి ఆమెను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. గంట తరువాత ఖైదీ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారని సూపరింటెండెంట్ తెలిపారు. మృతురాలి బంధువులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చినట్లు ఆమె వెల్లడించారు.
Advertisement
Advertisement