మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటిన వ్యక్తి అరెస్ట్ | The arrest of the person who poured petrol fire woman | Sakshi
Sakshi News home page

మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటిన వ్యక్తి అరెస్ట్

Jul 4 2016 10:02 AM | Updated on Sep 4 2018 5:21 PM

నగరంలోని తుకారంగేటు పోలీస్ స్టేషన్ పరిధిలోని బస్తీలో సోమవారం ఉదయం చిన్న గొడవ జరగడంతో ఆగ్రహించిన మల్లేష్ అనే వ్యక్తి చంద్రకళ అనే మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు.

నగరంలోని తుకారంగేటు పోలీస్ స్టేషన్ పరిధిలోని బస్తీలో సోమవారం ఉదయం చిన్న గొడవ జరగడంతో ఆగ్రహించిన మల్లేష్ అనే వ్యక్తి చంద్రకళ అనే మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు ప్రయత్నించి మంటలను ఆర్పారు. అప్పటికే ఆమె శరీరం చాలావరకూ కాలిపోయింది. వెంటనే ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించారు. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మల్లేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. చంద్రకళ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement