సుజనా తదితరులకు కోర్టు సమన్లు | Summons to Sujana and others | Sakshi
Sakshi News home page

సుజనా తదితరులకు కోర్టు సమన్లు

Feb 21 2016 2:54 AM | Updated on Aug 16 2018 4:36 PM

సుజనా తదితరులకు కోర్టు సమన్లు - Sakshi

సుజనా తదితరులకు కోర్టు సమన్లు

కేంద్రమంత్రి సుజనా చౌదరి, ఆయనకు చెందిన సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ తమను రూ.106 కోట్ల మేరకు మోసం

సాక్షి, హైదరాబాద్: కేంద్రమంత్రి సుజనా చౌదరి, ఆయనకు చెందిన సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ తమను రూ.106 కోట్ల మేరకు మోసం చేశారంటూ మారిషన్ కమర్షియల్ బ్యాంక్(ఎంసీబీ) దాఖలు చేసిన క్రిమినల్ ఫిర్యాదుపై ఇక్కడి చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు స్పందించింది.

సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డెరైక్టర్ జి.శ్రీనివాసరాజు, డెరైక్టర్ సందెపూడి హనుమంతరావు, నాన్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ సుజనా చౌదరి తదితరులకు సమన్లు జారీ చేసింది. మార్చి 5న వ్యక్తిగతంగా హాజరు కావాలని వారిని ఆదేశించింది. ఈ మేరకు 12వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ డానీ రూత్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement