అగ్రిగోల్డ్, అక్షయగోల్డ్‌లఆస్తుల వేలానికి సంబంధించి మెరుగైన ఫలితాల కోసం సూచనలు, సలహాలు తెలియచేయాలని ఉమ్మడి హైకోర్టు
అగ్రి, అక్షయగోల్డ్ కేసుల్లో న్యాయవాదులను కోరిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: అగ్రిగోల్డ్, అక్షయగోల్డ్‌లఆస్తుల వేలానికి సంబంధించి మెరుగైన ఫలితాల కోసం సూచనలు, సలహాలు తెలియచేయాలని ఉమ్మడి హైకోర్టు సోమవారం పిటిషనర్లను, అగ్రి, అక్షయ గోల్డ్ యాజమాన్యాలను కోరింది. ప్రస్తుత పరిస్థితుల్లో 32 లక్షల మంది డిపాజిటర్లను సంతృప్తిపరి చేలా చర్యలు తీసుకోవడం అసాధ్యంలా కనిపిస్తోందని పేర్కొంది. తదుపరి విచారణను ఈ నెల 22వ తేదీకి వాయిదా వేసింది.
ఈ మేరకు న్యాయ మూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. అగ్రిగోల్డ్, అక్షయగోల్డ్ యాజమా న్యాలు డిపాజిట్ల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసి, తిరిగి చెల్లించ కుండా ఎగవేశాయని, దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని పలువురు హైకోర్టులో వేర్వేరుగా పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.