అధికారమదంతోనే ఆ మాటలు | Sakshi
Sakshi News home page

అధికారమదంతోనే ఆ మాటలు

Published Sun, Dec 4 2016 3:13 AM

అధికారమదంతోనే ఆ మాటలు - Sakshi

కేసీఆర్, కేటీఆర్‌పై కాంగ్రెస్ నేతలు శ్రవణ్, దయాకర్ ధ్వజం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ద్రోహులైన తలసాని శ్రీనివాస్, తుమ్మల నాగేశ్వర్‌రావు వంటివారిని సిగ్గులేకుండా మంత్రులను చేసిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అధికారమదంతో మాట్లాడుతున్నారని టీపీ సీసీ అధికార ప్రతినిధులు దాసోజు శ్రవణ్, అద్దంకి దయాకర్ విమర్శించారు. గాంధీ భవన్‌లో శనివారం వారు విలేకరులతో మాట్లాడుతూ అబద్దపు హామీలతో, మోసం తో వచ్చిన అధికారం శాశ్వతంగా ఉండ దన్నారు. మంత్రి కేటీఆర్ స్థారుుకి మించి మాట్లాడటం తగదన్నారు. కోదండరాంపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవా లని, తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన కోదండరాంకు క్షమాపణలు చెప్పాలని శ్రవణ్, దయాకర్ సూచించారు. కోదండరాం అంటే ఒక వ్యక్తి కాదని, ఆయన వెనుక తెలంగాణ సమాజం ఉందన్నారు. తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని అహం కారంతో మాట్లాడటం మానుకోకుంటే ప్రజలు మంత్రి కేటీఆర్‌కు తగిన విధంగా బుద్ధిచెప్తారని హెచ్చరించారు.

విమలక్క కార్యాలయం సీజ్ సరికాదు..
అరుణోదయ సంస్థ అధ్యక్షురాలు విమలక్క విషయంలో పోలీసుల తీరు సరికాదని టీపీ సీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి, నేతలు దాసో జు శ్రవణ్, కత్తి వెంకటస్వామి, ఇందిరా శోభ న్, కైలాష్‌నేత హెచ్చరించారు. గాంధీభవన్ లో వారు శనివారం విలేకరులతో మాట్లా డుతూ తెలంగాణ కోసం నిరంతరం పోరాడిన విమలక్కపై పోలీసుల దాడి, చేయడం, కార్యాలయాన్ని సీజ్ చేయడం అప్రజాస్వామికమన్నారు.  

వికలాంగుల విభాగ చైర్మన్‌గా వీరయ్య
టీపీసీసీ వికలాంగుల విభాగం చైర్మన్‌గా ముత్తినేని వీరయ్యను నియమిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వహిస్తానని వీరయ్య తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement