ప్రత్యేక సలహాదారు పదవికి డీఎస్ రాజీనామా | Sakshi
Sakshi News home page

ప్రత్యేక సలహాదారు పదవికి డీఎస్ రాజీనామా

Published Sun, May 29 2016 2:38 AM

ప్రత్యేక సలహాదారు పదవికి డీఎస్ రాజీనామా

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు (అంతర్రాష్ట్ర సంబంధాలు) పదవికి ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్) శనివారం రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు అందజేయగా ప్రభుత్వం దాన్ని వెంటనే ఆమోదిస్తూ ఉత్తర్వులు (జీఓ ఆర్టీ నం.1206) జారీ చేసింది. రాష్ర్ట్రంలో రెండు రాజ్యసభ స్థానాలకు జరగనున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులుగా కెప్టెన్ వి. లక్ష్మీకాంతరావుతోపాటు తన పేరును పార్టీ నాయకత్వం ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వ నామినేటెడ్ పదవిని వదులుకోవాలని డీఎస్ నిర్ణయించుకున్నారు. ఈ నెల 31న ఆయన రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. గతేడాది ఆగస్టు 21న ప్రభుత్వం అంతర్రాష్ట్ర సంబంధాల వ్యవహారాల కోసం డీఎస్‌ను ప్రత్యేక సలహాదారుగా ఏడాది పదవీకాలానికి నియమించింది.

Advertisement
 
Advertisement
 
Advertisement