నగరంలోని హుక్కా సెంటర్లపై ఎస్‌వోటీ పోలీసులు బుధవారం రాత్రి దాడులు చేశారు.
హైదరాబాద్: నగరంలోని హుక్కా సెంటర్లపై ఎస్‌వోటీ పోలీసులు బుధవారం రాత్రి దాడులు చేశారు. ఈ ఘటన నేరేడ్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. డిఫెన్స్ కాలనీలో నిర్వహిస్తున్న రెండు హుక్కా సెంటర్లపై దాడి నిర్వహించి నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారిని నేరేడ్‌మెట్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.