ఇప్పటికే హిందీ, తమిళ భాషల్లో వార్తలు అందిస్తున్న బీబీసీ చానల్ ఇకపై తెలుగులో కూడా వెబ్‌చానల్ ప్రారంభించనున్నట్లు బీబీసీ ఇండియన్ లాంగ్వేజెస్ హెడ్ రూపా ఝా తెలిపారు.
హైదరాబాద్: ఇప్పటికే హిందీ, తమిళ భాషల్లో వార్తలు అందిస్తున్న బీబీసీ చానల్ ఇకపై తెలుగులో కూడా వెబ్‌చానల్ ప్రారంభించనున్నట్లు బీబీసీ ఇండియన్ లాంగ్వేజెస్ హెడ్ రూపా ఝా తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీబీసీ హెచ్.ఆర్ హెడ్ నివేదితతో కలసి మాట్లాడుతూ.. అతిత్వరలో తెలుగు, మరాఠి, గుజరాతీ, పంజాబీ నాలుగు భాషల్లో వెబ్‌చానల్ అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు.
వెబ్ చానల్‌లో ఉద్యోగ నియామకాల కోసం బీబీసీ వెబ్‌సైట్‌లో వరల్డ్ సర్వీస్ జాబ్స్ తెలుగు పేజీలో లాగిన్ కావాలని చెప్పారు. నియామకాలు పూర్తిగా ఆన్‌లైన్ ద్వారానే జరుగుతాయని తెలిపారు.