ఎస్సై పీటీవో ప్రిలిమినరీ ఫలితాలు విడుదల | SI PTO Preliminary results released | Sakshi
Sakshi News home page

ఎస్సై పీటీవో ప్రిలిమినరీ ఫలితాలు విడుదల

May 14 2016 3:22 AM | Updated on Aug 21 2018 9:20 PM

పోలీసు రవాణా సంస్థ (పీటీవో) ఎస్సై పోస్టులకు నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను రిక్రూట్‌మెంట్ బోర్డు విడుదల చేసింది.

సాక్షి, హైదరాబాద్: పోలీసు రవాణా సంస్థ (పీటీవో) ఎస్సై పోస్టులకు నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను రిక్రూట్‌మెంట్ బోర్డు విడుదల చేసింది. గత నెల 25న నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షకు 1,498 మంది హాజరు కాగా 388 మంది అర్హత సాధించారు. ఎస్సీ విభాగంలో 108, ఎస్టీ విభాగంలో 85, ఓపెన్ కేటగిరీ విభాగంలో 26 మంది అర్హత సాధించారు.

పరీక్ష ఫలితాల ఓఎంఆర్ జవాబు పత్రాలను బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచింది. ఫలితాలపై అభ్యంతరాలుంటే రీవాల్యుయేషన్‌కు అవకాశం కల్పించింది. రీవాల్యుయేషన్ కోసం ఈ నెల 16 లోపు జనరల్ కేటగిరీ అభ్యర్థులు రూ. 5 వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.2 వేలు చెల్లించాల్సిందిగా బోర్డు చైర్మన్ జె.పూర్ణచందర్‌రావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement