నెంబర్ 1 అంటే ఇదేనా..!? | setires on chandra babu in social media | Sakshi
Sakshi News home page

నెంబర్ 1 అంటే ఇదేనా..!?

Feb 5 2016 8:51 PM | Updated on Sep 3 2017 5:01 PM

నెంబర్ 1 అంటే ఇదేనా..!?

నెంబర్ 1 అంటే ఇదేనా..!?

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం పార్టీకి ఒకే ఒక్క సీటు రావడంపై నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం పార్టీకి ఒకే ఒక్క సీటు రావడంపై నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. హైదరాబాద్ మాదిరిగా ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ది చేస్తానని, నెంబర్ వన్ చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తరచూ చెప్పే మాటలపై సెటైర్లు వేశారు.
 

బాబు వ్యాఖ్యలను గ్రేటర్ హైదరాబాద్ ఫలితాలతో పోలుస్తూ.. నెంబర్ వన్ అంటే ఏమిటో అనుకున్నా.. నెంబర్ వన్ అంటే ఇదా అంటూ ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం ఆశ్చర్యపోయేలా కామెంట్ చేస్తూ ఇద్దరి ఫొటోలు పెట్టారు. ఇక ప్రపంచ పటంలో హైదరాబాద్ ను అగ్రస్థానంలో నిలబెట్టానని చెప్పుకునే చంద్రబాబు వ్యాఖ్యలపైనా నెటిజన్లు సెటైర్లు వేశారు. హైదరాబాద్ పటంలో చంద్రబాబు లేకుండా ఓటర్లు చేశారని కామెంట్లు పోస్ట్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement