పాస్‌పోర్ట్‌ లేదని మృతదేహం నిలిపివేత | sending dead body to india from poland | Sakshi
Sakshi News home page

పాస్‌పోర్ట్‌ లేదని మృతదేహం నిలిపివేత

Feb 13 2017 9:59 AM | Updated on Sep 5 2017 3:37 AM

కూతుర్ని కోల్పోయిన తల్లిదండ్రులు.. ఎయిర్‌పోర్ట్‌లో నరకయాతన అనుభవిస్తున్నారు.

శంషాబాద్‌: కూతురు చనిపోయి విషాదంలో ఉన్న తల్లిదండ్రులను శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ సిబ్బంది ప్రవర్తన మరింత బాధకు గురిచేస్తోంది. వివరాలు.. గత వారం పోలెండ్‌లో నాగశైలజ అనే విద్యార్థిని అనారోగ‍్యంతో మృతిచెందింది. కుటుంబసభ‍్యులు మృతదేహాన్ని పోలెండ్‌ నుంచి విమానంలో తీసుకువచ్చారు.

నాగశైలజకు పాస్‌పోర్టు లేదన‍్న కారణంగా శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు సిబ‍్బంది మృతదేహాన్ని బంధువులకు అప‍్పగించేందుకు నిరాకరించడంతో కుటుంబసభ‍్యులు సోమవారం ఉదయం ఆందోళనకు దిగారు. విమాన సిబ‍్బంది నిర‍్లక్ష‍్యం కారణంగానే నాగశైలజ పాస్‌పోర్టు మిస్‌ అయిందని కుటుంబసభ‍్యులు పేర‍్కొంటున్నారు. పాస్‌పోర్ట్ కారణం చూపి తమ బిడ‍్డ మృతదేహాన్ని తమకు అప‍్పగించేందుకు నిరాకరించడం దారుణమని వారు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఉన‍్నతాధికారులు జోక‍్యం చేసుకుని మృతదేహాన్ని అప‍్పగించాలని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement