స్కూలుకు వెళ్లి టీచర్ అదృశ్యం | school teacher disappeared | Sakshi
Sakshi News home page

స్కూలుకు వెళ్లి టీచర్ అదృశ్యం

Dec 8 2015 8:08 PM | Updated on Sep 4 2018 5:07 PM

పాఠశాలకు వెళ్లిన ఉపాధ్యాయురాలు కనిపించకుండా పోయిన సంఘటన మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది.

పాఠశాలకు వెళ్లిన ఉపాధ్యాయురాలు కనిపించకుండా పోయిన సంఘటన మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై నాగేశ్వరరావు కథనం ప్రకారం... బాలసరస్వతీనగర్‌కు చెందిన అరవింద(27) మల్కాజిగిరి గీతానగర్‌లోని ప్రైవేట్ మోడల్ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తోంది. ఈ నెల 7వ తేదీన పాఠశాలకు వెళ్లిన ఆమె తిరిగి ఇంటికి చేరుకోలేదు. సెల్‌ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుండడంతో మంగళవారం ఆమె భర్త ముఖేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement