నగరంలోని కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ప్రగతినగర్‌లో దొంగలు బీభత్సం సృష్టించారు.
హైదరాబాద్: నగరంలోని కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ప్రగతినగర్‌లో దొంగలు బీభత్సం సృష్టించారు. స్థానిక కెనరాబ్యాంక్ ఏటీఎంలో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత చోరీ చేసేందుకు దొంగలు విఫలయత్నం చేశారు. ఏటీఎం మిషన్‌ను పగలగొట్టేందుకు దుండగులు ప్రయత్నించారు. అది తెరుచుకోకపోవడంతో పరారయ్యారు. బుధవారం ఉదయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమివ్వడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.