సత్యం రామలింగరాజు విడుదల | Ramalinga Raju released on bail | Sakshi
Sakshi News home page

సత్యం రామలింగరాజు విడుదల

May 13 2015 6:41 PM | Updated on Sep 3 2017 1:58 AM

రామలింగరాజు

రామలింగరాజు

చర్లపల్లి జైలు నుంచి సత్యం కంప్యూటర్స్ కుంభకోణం ప్రధాన నిందితుడు, సత్యం కంప్యూటర్స్ వ్యవస్థాపకుడు బి.రామలింగరాజు మరో ఏడుగురు బెయిలుపై బుధవారం సాయంత్రం విడుదలయ్యారు.

హైదరాబాద్: చర్లపల్లి జైలు నుంచి సత్యం కంప్యూటర్స్ కుంభకోణం ప్రధాన నిందితుడు, సత్యం కంప్యూటర్స్ వ్యవస్థాపకుడు బి.రామలింగరాజు మరో ఏడుగురు బెయిలుపై బుధవారం సాయంత్రం విడుదలయ్యారు. నాంపల్లిలోని ఆర్థిక నేరాల విచారణ ప్రత్యేక కోర్టు సోమవారమే వీరికి బెయిల్ మంజూరు చేసింది. అయితే ఆ పత్రాలు జైలు అధికారులకు అందడం జాప్యం జరగడం వల్ల వారు ఈ రోజు విడుదలయ్యారు.

సత్యం కుంభకోణం కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తనకు ఏడేళ్లు జైలు శిక్ష విధించడాన్ని సవాలు చేస్తూ  ఆయన నాంపల్లి కోర్టులలో అప్పీల్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. రామలింగరాజు, అతని సోదరుడు రామరాజు లక్ష రూపాయల చొప్పున, మిగతా నిందితులు 50 వేల రూపాయల పూచికత్తు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఆ మేరకు వారు పూచీకత్తు సమర్పించి విడుదలయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement