సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ గా రామచంద్రమూర్తి | ramachandra murthy takes over as ED of Sakshi | Sakshi
Sakshi News home page

సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ గా రామచంద్రమూర్తి

Sep 6 2014 10:54 PM | Updated on Aug 20 2018 8:20 PM

సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ గా రామచంద్రమూర్తి - Sakshi

సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ గా రామచంద్రమూర్తి

సుప్రసిద్ధ పాత్రికేయులు డాక్టర్ కె.రామచంద్రమూర్తి 'సాక్షి' మీడియా గ్రూపులో ఎడిటోరియల్ డైరెక్టర్ గా నియమితులయ్యారు.

సుప్రసిద్ధ పాత్రికేయులు డాక్టర్ కె.రామచంద్రమూర్తి 'సాక్షి' మీడియా గ్రూపులో ఎడిటోరియల్ డైరెక్టర్ గా నియమితులయ్యారు. పాత్రికేయ రంగంలో విశేష అనుభవం ఉన్న రామచంద్రమూర్తి పలు మీడియా సంస్థల ద్వారా సమాజానికి విశిష్ట సేవలు అందించారు. ఆయన అనుభవం 'సాక్షి' మీడియా గ్రూపు సంస్థల ఉన్నతికి, వాటి ద్వారా సమాజ ఉన్నతికి దోహదపడుతుందని ఆశిస్తున్నాం.

ఉన్నత పాత్రికేయ ప్రమాణాలను పాటిస్తూ.. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి ఆలంబనంగా నిలుస్తూ 'సాక్షి' సాగిస్తున్న ప్రస్థానాన్ని మరింత మెరుగుపరిచే కృషిలో ఇది ఒక భాగం. కుల,మత,  ప్రాంతీయ, రాజకీయ విభేదాలకు అతీతంగా అన్ని రకాల వార్తలను యథాతథంగా, సత్యనిష్టతో, జనస్వామ్య స్ఫూర్తితో అందజేసే 'సాక్షి' సంప్రదాయ  ఒరవడి ఎప్పటికీ కొనసాగుతుంది. ప్రజలకు, పాలకులకు మధ్య వారధిగా 'సాక్షి' నిర్మాణాత్మక పాత్ర పోషిస్తోంది. నాణేనికి రెండు పక్కలా ఏముందో చూపెట్టడం 'సాక్షి' నిర్దేశిత విధానం. ప్రజా సమస్యలను ఎత్తి చూపడం,వాటి పరిష్కారానికి గొంతెత్తడం 'సాక్షి' విద్యుక్త ధర్మం.



                                                                                               వై. ఈశ్వర ప్రసాద్ రెడ్డి
                                                                                              డైరెక్టర్ ఫైనాన్స్, అడ్మినిస్ట్రేషన్

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement