రాజాసింగ్‌ను బొల్లారం పీఎస్‌కు తరలింపు | Rajasingh to send to Bollaram police station | Sakshi
Sakshi News home page

రాజాసింగ్‌ను బొల్లారం పీఎస్‌కు తరలింపు

Dec 10 2015 12:10 PM | Updated on Sep 3 2017 1:47 PM

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ను బొల్లారం పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

హైదరాబాద్‌: ఎమ్మెల్యే రాజాసింగ్ను పోలీసులు గోషామహల్ నుంచి బొల్లారం పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. బీఫ్‌ ఫెస్టివల్‌ నేపథ్యంలో గురువారం ఛలో ఓయూకు పిలుపునిచ్చిన ఆయనను మంగళ్హాట్లోని తన నివాసంలోనే పోలీసులు అరెస్ట్‌ చేశారు. అనంతరం సాయినాథ్గంజ్ ఏసీపీ కార్యాలయానికి తరలించారు. కాగా ఓయూలో బీఫ్ ఫెస్టివల్ను అడ్డుకుంటామని రాజాసింగ్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు పలువురు అనుమానితులను టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇదిలా ఉండగా, బీఫ్‌ ఫెస్టివల్‌కు వ్యతిరేకంగా హైదరాబాద్‌ నగరంలో ఆందోళనలు పెద్ద ఎత్తునా జరుగుతున్నాయి. పలు చోట్ల ఆర్టీసీ బస్సులపై రాళ్లతో దాడులు చేశారు. ఈ దాడుల్లో బస్సుల అద్దాలు ధ్వంసమయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement