మళ్లీ అపోలో ఆస్పత్రికి రాజయ్య | Rajaiah admitted in Apollo again | Sakshi
Sakshi News home page

మళ్లీ అపోలో ఆస్పత్రికి రాజయ్య

Jan 28 2015 9:28 AM | Updated on Sep 2 2017 8:25 PM

మళ్లీ అపోలో ఆస్పత్రికి రాజయ్య

మళ్లీ అపోలో ఆస్పత్రికి రాజయ్య

మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య మరోసారి అపోలో ఆస్పత్రిలో చేరారు. బుధవారం ఉదయం ఆయనను ...

హైదరాబాద్ : మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య మరోసారి అపోలో ఆస్పత్రిలో చేరారు. బుధవారం ఉదయం ఆయనను కుటుంబ సభ్యులు వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తీసుకు వచ్చారు. తీవ్రమైన  గుండెపోటు రావడంతో రాజయ్యను మంగళవారం సాయంత్రం  హైదర్గూడ అపోలో ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే.  

రాజయ్యకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆయనకు బీపీ, పల్స్ రేటు పెరిగినట్లు గుర్తించారు. అనంతరం రాజయ్యను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. కాగా వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి రావాల్సిందిగా గతరాత్రి వైద్యులు సూచించారు. దాంతో డాక్టర్ల సూచన మేరకు రాజయ్య ఈరోజు ఉదయం ఆస్పత్రికి వచ్చి వైద్య పరీక్షలు చేయించుకున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement