ఎడ్‌సెట్ రెండో దశ కౌన్సెలింగ్ నిర్వహించండి
ఎడ్‌సెట్ రెండో దశ కౌన్సెలింగ్ నిర్వహించాలని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డికి టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం విజ్ఞప్తి చేశారు.
	సాక్షి, హైదరాబాద్: ఎడ్‌సెట్ రెండో దశ కౌన్సెలింగ్ నిర్వహించాలని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డికి టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం విజ్ఞప్తి చేశారు. మంగళవారం పాపిరెడ్డితో బీఎడ్ కాలేజీ యాజమాన్య ప్రతినిధులు, కోదండరాం సమావేశమయ్యారు.
	
	11 కొత్త కాలేజీల అనుమతి విషయంలో ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నందున రెండో దశ కౌన్సెలింగ్ ఉండకపోవచ్చని పాపిరెడ్డి వెల్లడించినట్లు యాజమాన్య సంఘాల ప్రతినిధి కత్తి రాందాస్ తెలిపారు. ఆ కాలేజీలను మినహాయించి మిగతా కాలేజీల్లో ప్రవేశాలకు  కౌన్సెలింగ్ నిర్వహించాలని కోదండరాం కోరారు.
	 

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
