బ్రిజేశ్ తీర్పుపై అసెంబ్లీలో చర్చించాలి | Ponguleti sudhakarreddi about the judgment of the brijeskumar tribunal | Sakshi
Sakshi News home page

బ్రిజేశ్ తీర్పుపై అసెంబ్లీలో చర్చించాలి

Oct 24 2016 1:00 AM | Updated on Sep 17 2018 8:11 PM

బ్రిజేశ్ తీర్పుపై అసెంబ్లీలో చర్చించాలి - Sakshi

బ్రిజేశ్ తీర్పుపై అసెంబ్లీలో చర్చించాలి

కృష్ణా నదీజలాల విషయంలో బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పుపై అసెంబ్లీలో చర్చించాలని,

పొంగులేటి సుధాకర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీజలాల విషయంలో బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పుపై అసెంబ్లీలో చర్చించాలని, అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని శాసనమండలిలో కాంగ్రెస్ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారంనాడిక్కడ విలేకరులతో ఆయన మాట్లాడుతూ బ్రిజేశ్ తీర్పు రెండు తెలుగు రాష్ట్రాలకు నష్టమన్నారు. ఈ తీర్పు వల్ల ప్రజలు నష్టపోతారని, ఇది నాయకుల స్వంత వ్యవహారం కాదన్నారు. ఈ తీర్పును అసెంబ్లీలో ప్రధాన అంశంగా తీసుకుని చర్చించాలని ఆయన డిమాండ్ చేశారు.

టీఆర్‌ఎస్ తనకోసం చేయించుకున్న సర్వేలు స్వంతడబ్బా కొట్టుకోవడానికేనన్నారు. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.  కృష్ణా జలాల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఒత్తిడితోనే ఎగువ రాష్ట్రాలకు అనుకూలమైన తీర్పు వచ్చిందని ఆరోపించారు. ఈ తీర్పుపై కేంద్ర ప్రభుత్వంతో పోరాడాలని పొంగులేటి సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement