గోల్కొండ కోట వద్ద బుధవారం ఉద్రిక్తత నెలకొంది. గోల్కొండ కోటలో జెండా ఎగరవేయడానికి వెళ్తున్న బిజెపి కార్యకర్తలను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు.
	హైదరాబాద్ :  గోల్కొండ కోట వద్ద బుధవారం ఉద్రిక్తత నెలకొంది. గోల్కొండ కోటలో జెండా ఎగరవేయడానికి వెళ్తున్న బిజెపి కార్యకర్తలను బుధవారం  పోలీసులు అరెస్ట్ చేశారు. కోటకు వెళ్లే అన్ని దారుల వద్దా భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు కోటలో జెండా ఎగురవేయడానికి అనుమతి లేదని స్పష్టం చేశారు.  అరెస్ట్ చేసిన బీజేపీ కార్యకర్తలను అసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. మరోవైపు  బాపూ ఘాట్ నుంచి బీజేపీ నేతలు గోల్కొండ కోట వరకూ ర్యాలీగా వెళ్లనున్నారు.
	
	 

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
