ఆన్‌లైన్ మార్కెటింగ్ విధానం ద్వారా వ్యాపారులు దేశంలోని ఏ ప్రాంతం నుంచైనా వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు వీలు కల్పించే జాతీయ వ్యవసాయ మార్కెటింగ్ (నామ్)
జాతీయ మార్కెట్లతో రాష్ట్ర మార్కెట్ల అనుసంధానం
సాక్షి, హైదరాబాద్: ఆన్‌లైన్ మార్కెటింగ్ విధానం ద్వారా వ్యాపారులు దేశంలోని ఏ ప్రాంతం నుంచైనా వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు వీలు కల్పించే జాతీయ వ్యవసాయ మార్కెటింగ్ (నామ్) పథకాన్ని ప్రధాని మోదీ గురువారం ప్రారంభించనున్నారు. దేశవ్యాప్తంగా 214 వ్యవసాయ మార్కెట్లను అనుసంధానిస్తారు. అందులో రాష్ట్రం నుంచి 44 మార్కెట్లు ఉండగా.. తొలుత నిజామాబాద్ (పసుపు), తిరుమలగిరి (ధాన్యం), వరంగల్ (మొక్కజొన్న), హైదరాబాద్ (మిర్చి), బాదేపల్లి (ధాన్యం) మార్కెట్లలో ప్రారంభించేందుకు ఆశాఖ ఏర్పాట్లు పూర్తి చేిసిం ది. ఈ పథకం ప్రారంభం సందర్భంగా ప్ర ధాని మోదీ నిజామాబాద్ యార్డులోని రై తులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖాముఖి జరుపుతారని అధికారులు తొలుత ప్రకటించారు. ఈ మేరకు ఏర్పాట్లు కూడా చేసినా.. అది రద్దయ్యే అవకాశముందని మార్కెటింగ్ శాఖ వర్గాలు వెల్లడించాయి.