డీజీపీల సదస్సుకు హాజరైన మోదీ
జాతీయ పోలీస్ అకాడమీ(ఎన్పీఏ)లో జరుగుతున్న అఖిల భారత డీజీపీల సదస్సు(ఏఐడీఎమ్)కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరయ్యారు.
హైదరాబాద్: జాతీయ పోలీస్ అకాడమీ(ఎన్పీఏ)లో జరుగుతున్న అఖిల భారత డీజీపీల సదస్సు(ఏఐడీఎమ్)కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరయ్యారు. మొత్తం మూడు రోజుల పాటు సాగనున్న సదస్సులో రెండు రోజు సదస్సును మోదీ ఆరంభించారు. అంతకుముందు తెల్లవారుజామున డీజీపీలతో కలిసి మోదీ యోగాసనాలు వేశారు. అకాడమీలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి, పోలీసు అమరవీరులకు ఘననివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ లు సింగ్ లు హాజరయ్యారు. దేశ భద్రత, పోలీస్ వ్యవస్ధ పటిష్టతపై సదస్సులో చర్చిస్తారు. శనివారం సాయంత్రం ఐదు గంటల వరకూ సదస్సు కొనసాగనుంది.