హజ్‌యాత్రకు పాస్‌పోర్టులు సిద్ధం చేసుకోవాలి | Passports should be ready for Haj tour-2015 | Sakshi
Sakshi News home page

హజ్‌యాత్రకు పాస్‌పోర్టులు సిద్ధం చేసుకోవాలి

Dec 11 2014 7:29 AM | Updated on Sep 2 2017 6:00 PM

హజ్‌యాత్ర-2015కు వెళ్లాలనే ఆసక్తి ఉన్నవారు పాస్‌పోర్టులను సిద్ధం చేసుకోవాలని తెలంగాణ హజ్ కమిటీ స్పెషల్ ఆఫీసర్ ఎస్.ఎ.షుకూర్ బుధవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.

సాక్షి, హైదరాబాద్: హజ్‌యాత్ర-2015కు వెళ్లాలనే ఆసక్తి ఉన్నవారు పాస్‌పోర్టులను సిద్ధం చేసుకోవాలని తెలంగాణ హజ్ కమిటీ స్పెషల్ ఆఫీసర్ ఎస్.ఎ.షుకూర్ బుధవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. హజ్ యాత్రకు సంబంధించిన దరఖాస్తు ఫారాల పంపిణీ ప్రక్రియ జనవరి నుంచి ప్రారంభమవుతుందని ఆయన పేర్కొన్నారు. పాస్‌పోర్టులను ఖచ్చితంగా జతచేయాలని, లేనియెడల ఆ దరఖాస్తులు స్వీకరించబోమని ఆయన స్పష్టం చేశారు. దరఖాస్తు ఫారంలో బ్యాంక్ ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌తోపాటు ఖాతా నంబరు కూడా తెలియజేయాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement