సాక్షి,హైదరాబాద్: బహుళ ప్రయోజనకారిగా ఉపయోగపడుతున్న ఆధార్‌లో మార్పులు, చేర్పుల కోసం ఆధార్ సేవా కేంద్రాలకు పరుగులు తీయాల్సిన అవసరం లేదు. టోకెన్ తీసుకొని క్యూలో నిల్చోవాల్సిన పని లేదు. ఇక ఇంట్లోంచే ఆన్‌లైన్ ద్వారా వెబ్‌సైట్‌లో మొత్తం దిద్దుబాటు ప్రక్రియను పూర్తి చేసుకునే విధంగా భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) మరింత వెసుబాటు కల్పించింది.
త్వరితగతిన పూర్తి..
ఆధార్ అప్‌డేట్ ప్రక్రియలో పాన్‌కార్డులు, పాస్‌పోర్ట్‌లు, డ్రైవింగ్ లైసెన్స్‌లు, రేషన్ కార్డులు వంటి ప్రభుత్వ పత్రాలతో సహా వినియోగదారులు ఇచ్చే సమాచారం కూడా డిజిటల్‌గా ధ్రువీకరిస్తారు. ఇది అప్‌డేట్స్ ప్రాసెస్‌ను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తయ్యే పరిస్థితిని కల్పిస్తుంది. పౌరులు తమ పేరు, చిరునామా, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్ వంటి కీలక సమాచారాన్ని ఆన్‌లైన్‌లోనే అప్‌డేట్ చేసుకోవచ్చు. వాస్తవంగా ఆధార్ అప్‌డేట్‌కు డిజిటల్ వెసులుబాటు ఉంది, అయితే.. అన్ని రకాల అప్‌డేట్‌లు చేయడం ఆన్‌లైన్‌లో సాధ్యం కాదు. చిరునామా వంటి వివరాలను యూఐడీఏఐ పోర్టల్ లేదా మై ఆధార్ యాప్ ద్వారా
ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయవచ్చు. కానీ.. ఫొటో, వేలిముద్రలు, ఐరిస్ వంటి బయోమెట్రిక్ వివరాలను మార్చడానికి తప్పనిసరిగా ఆధార్ నమోదు కేంద్రాన్ని సందర్శించాల్సి ఉంటుంది.
అప్‌డేట్ ఇలా..
చిరునామా అప్‌డేట్: గుర్తింపు చిరునామా ఏదైనా రుజువు ప్రతం ఉంటే, పోర్టల్ లేదా మై ఆధార్ యాప్‌ని ఉపయోగించి చిరునామాను ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయవచ్చు.డాక్యుమెంట్ల అప్‌లోడ్: గుర్తింపు చిరునామా రుజువు పత్రాలను ఆన్‌లైన్‌లో ఉచితంగా అప్‌లోడ్ చేయవచ్చు (జూన్ 14, 2026 వరకు).
మొబైల్ నంబర్: ఆన్‌లైన్ సేవలను ఉపయోగించడానికి మొబైల్ నంబర్‌ను ఆధార్‌కు తప్పనిసరిగా నమోదు చేసుకోవచ్చు
ఐరిస్, బయోమెట్రిక్ కోసంబయోమెట్రిక్ అప్‌డేట్: ఆధార్ నమోదు, అప్‌డేట్ కేంద్రానికి వెళ్లడం ద్వారా మాత్రమే ఫొటో, వేలిముద్రలు, ఐరిస్ వంటి బయోమెట్రిక్ వివరాలను అప్‌డేట్ చేసుకునే వెసులుబాటు ఉంది.


