బంద్ పాటిస్తున్న ఓలా, ఉబర్ తదితర క్యాబ్‌ల డ్రైవర్లు ఇతర క్యాబ్‌లను కూడా అడ్డుకుంటున్నారు.
హైదరాబాద్: బంద్ పాటిస్తున్న ఓలా, ఉబర్ తదితర క్యాబ్‌ల డ్రైవర్లు ఇతర క్యాబ్‌లను కూడా అడ్డుకుంటున్నారు. శనివారం ఉదయం నుంచి నగరంలో బంద్‌లో పాల్గొనని క్యాబ్‌లను ఇతర క్యాబ్‌ల డ్రైవర్లు అడ్డుకుంటున్నారు. ఆయా వాహనాల్లో ప్రయాణిస్తున్న వారిని కూడా కిందికి దించేస్తున్నారు. నగరంలోని కుత్బుల్లాపూర్, ఐడీపీఎల్, సుచిత్ర తదితర అన్ని ప్రాంతాల్లోనూ ఇదే తీరు కొనసాగుతోంది. వీరి వైఖరితో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.