మాజీ డీజీపీ సోదరుని ఇంట్లో నగలు పోలేదట.. | no robbery incident at EX dgp dinesh reddy relatives home | Sakshi
Sakshi News home page

మాజీ డీజీపీ సోదరుని ఇంట్లో నగలు పోలేదట..

Jul 10 2015 8:28 PM | Updated on Sep 3 2017 5:15 AM

మాజీ డీజీపీ దినేష్‌రెడ్డి సోదరుని కుమార్తె నివాసంలో అదృశ్యమైన విలువైన వజ్రాభరణాలు... భద్రంగా ఉన్నట్టు తెలియడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

బంజారాహిల్స్ (హైదరాబాద్): మాజీ డీజీపీ దినేష్‌రెడ్డి సోదరుని కుమార్తె నివాసంలో అదృశ్యమైన విలువైన వజ్రాభరణాలు... భద్రంగా ఉన్నట్టు తెలియడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. గత నెల అమెరికాకు వెళ్లే సమయంలో దినే ష్‌రెడ్డి సోదరుని కుమార్తె ఐశ్వర్య బంగారు గాజులు, ఉంగరాలను ఓ చీరలో ఉంచి అలమారాలో పెట్టారు. తాను అమెరికా నుంచి తిరిగి వచ్చాక అవి కనిపించకపోవడంతో చోరీకి గురయ్యాయంటూ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వీటి విలువ చాలా ఉంటుందని కూడా ఆమె పేర్కొనడంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఆమె ఇంట్లో పని చేస్తున్న డ్రై వర్లను, పని మనుషులను, వంట మనుషులను వారం రోజుల పాటు విచారించారు. ఫలితం లేకపోవడంతో ఎవరైనా దొంగల ముఠా ఈ చోరీకి పాల్పడి ఉంటుందని భావిస్తున్న తరుణంలో తమ నగలు దొరికాయంటూ ఐశ్వర్య పోలీసులకు సమాచారం ఇచ్చారు. చీరలో నగలు భద్రంగా ఉన్నాయని తెలియజేయడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement