
పథకాల అమల్లో రాజకీయ జోక్యం వద్దు
సంక్షేమ పథకాల అమల్లో ప్రత్యక్ష రాజకీయ జోక్యం ఉండకూడదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుకు సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విజ్ఞప్తి చేశారు.
సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ పథకాల అమల్లో ప్రత్యక్ష రాజకీయ జోక్యం ఉండకూడదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుకు సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విజ్ఞప్తి చేశారు. కల్యాణలక్ష్మి పథకం మార్గదర్శకాలను మార్చి రాజకీయ జోక్యాన్ని పెంచాలనే నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని సీఎంకు రాసిన లేఖలో ఆయన కోరారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్ల లబ్ధిదారుల ఎంపికలో ఎమ్మెల్యేలే పరోక్ష పెత్తనం చేస్తున్నారన్నారు. పథకాల విధివిధానాలను ప్రభుత్వం రూపొందిస్తే, వీటిని అధికార యంత్రాంగం అమలు చేయాలన్నారు. కానీ రెండింట్లోనూ ప్రజాప్రతినిధులు ప్రధాన పాత్ర పోషించడం వల్ల ప్రభుత్వ యంత్రాంగం నిర్వీర్యమైపోతోందన్నారు.