డీఎస్సీ రద్దు.. సర్వీస్ కమిషనే దిక్కు! | no more dsc, teacher recruitment to be taken up by public service commission | Sakshi
Sakshi News home page

డీఎస్సీ రద్దు.. సర్వీస్ కమిషనే దిక్కు!

May 18 2016 1:47 PM | Updated on Sep 4 2017 12:23 AM

డీఎస్సీ రద్దు.. సర్వీస్ కమిషనే దిక్కు!

డీఎస్సీ రద్దు.. సర్వీస్ కమిషనే దిక్కు!

ఉపాధ్యాయుల నియామకం తీరుతెన్నులు ఒక్కసారిగా మారిపోనున్నాయి. ఇన్నాళ్లూ జిల్లా సెలెక్షన్ కమిటీ (డీఎస్సీ) ద్వారా చేపట్టిన టీచర్ల నియామక పద్ధతికి తెలంగాణ సర్కారు చరమగతం పాడింది.

ఉపాధ్యాయుల నియామకం తీరుతెన్నులు ఒక్కసారిగా మారిపోనున్నాయి. ఇన్నాళ్లూ జిల్లా సెలెక్షన్ కమిటీ (డీఎస్సీ) ద్వారా చేపట్టిన టీచర్ల నియామక పద్ధతికి తెలంగాణ సర్కారు చరమగతం పాడింది. ఆ స్థానంలో.. ఉపాధ్యాయులను పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా మాత్రమే నియమించాలని నిర్ణయించింది. ఈ మేరకు పాఠశాల విద్య కమిషనర్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్. ఆచార్య ఉత్తర్వులను జారీచేశారు. ప్రత్యక్ష నియామకాలను రద్దుచేసి, వాటిని పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు అప్పగించడానికి ఎంతవరకు వీలవుతుందో పరిశీలించాలని జీఏడీని కోరిన మేరకు.. తెలంగాణ పాఠశాల విద్య డైరెక్టర్ పరిధిలో ఉన్న అన్ని రకాల టీచర్ పోస్టులను ప్రత్యక్ష నియామక పద్ధతి నుంచి తప్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

దీంతో స్కూలు అసిస్టెంట్లు, భాషా పండితులు, సెకండరీ గ్రేడ్ టీచర్లు, పీఈటీలను ఇన్నాళ్లుగా డీఎస్సీల ద్వారా నియమిస్తుండగా.. ఇకపై తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ (టీఎస్‌పీఎస్‌సీ) ద్వారా మాత్రమే నియమిస్తారు. ఏకరూపత, స్థిరత్వం, సరైన ఎంపిక పద్ధతుల కోసం ఇలా చేసినట్లు బుధవారం విడుదల చేసిన జీవో నెం. 19లో పేర్కొన్నారు. పాఠశాల విద్య డైరెక్టర్ నియంత్రణలో ఉన్న మోడల్ స్కూళ్లలో ఉన్న ప్రిన్సిపాళ్లు, పీజీ టీచర్లు, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ల పోస్టులను కూడా టీఎస్‌పీఎస్‌సీ ద్వారానే నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు టీఎస్‌పీఎస్‌సీ కార్యదర్శి, పాఠశాల విద్య డైరెక్టర్ తదితరులు తగు చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులలో తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement