తెలంగాణ రాష్ట్రంలో త్వరలో కొత్త ఎన్‌ఆర్‌ఐ పాలసీ రూపకల్పన చేస్తామని తెలంగాణ ఐటీ, మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో త్వరలో కొత్త ఎన్‌ఆర్‌ఐ పాలసీ రూపకల్పన చేస్తామని తెలంగాణ ఐటీ, మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. తెలంగాణ యువత, గల్ఫ్ ఉపాధి వంటి సమస్యల పరిష్కారం దిశగా.. కొత్త ఎన్‌ఆర్‌ఐ పాలసీ రూపొందించాలని అధికారులను ఆయన ఆదేశించారు. శనివారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు.
ఇతర రాష్ట్రాల్లో పాలసీలనూ అధ్యయనం చేయాలని అధికారులను కోరారు. కేరళ, పంజాబ్ రాష్ట్రాల్లో ఉన్న ఎన్‌ఆర్‌ఐ పాలసీలను తెలంగాణ ప్రభుత్వం అధ్యయనం చేయనుంది. ఎన్‌ఆర్‌ఐ సంఘాలు, గల్ఫ్ తెలంగాణ ప్రతినిధులతో త్వరలో సమావేశం కానుంది.