కుమారుడికి తల్లి చిత్రహింసలు | Mother tortured son | Sakshi
Sakshi News home page

కుమారుడికి తల్లి చిత్రహింసలు

Sep 12 2016 5:09 PM | Updated on Mar 23 2019 9:28 PM

కొడుకును చిత్రహింసలు పెడుతున్న తల్లిపై బాలల హక్కుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది.

మాట వినడం లేదనే అక్కసుతో కొడుకును చిత్రహింసలు పెడుతున్న తల్లిపై బాలల హక్కుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. వివరాలివీ.. ఎస్‌ఆర్‌నగర్‌కు చెందిన కిరణ్, అపర్ణ దంపతులకు ఆరేళ్ల కుమారుడు ఉన్నాడు. ఇంటి వద్ద అల్లరి చేస్తున్నాడని ఆగ్రహించిన తల్లి అపర్ణ కొడుకును కొట్టి, వాతలు పెట్టింది. దీనిపై తండ్రి కిరణ్ సోమవారం బాలల హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఆమెపై చర్యలు తీసుకుని, కౌన్సెలింగ్ ఇప్పించాలని కోరారు.ఈ ఘటన వివరాలు తెలుసుకున్న సంఘం అపర్ణపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

 

Advertisement
 
Advertisement
Advertisement