
ఇంతమంది మహిళలు ఒంటరివాళ్లా?
గంభీ రంగా కనిపించే ఎమ్మెల్యే వి.శ్రీనివాస్‌గౌడ్ కంట తడి పెట్టారు.
ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ కంటతడి
మహబూబ్‌నగర్ రూరల్: గంభీ రంగా కనిపించే ఎమ్మెల్యే వి.శ్రీనివాస్‌గౌడ్ కంట తడి పెట్టారు. దుఃఖం ఉబికివస్తున్నా ఆపుకున్నారు.ఆదివారం మహబూబ్‌నగర్ లో ఒంటరి మహిళలకు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఈ ఉద్విగ్నక్షణాలు చోటుచే సుకున్నాయి.
స్థానిక అంబేడ్కర్ కళా భవన్ లో సీట్ల పరిమితికి మించి ఒంటరి మహిళలు హాజరయ్యారు. వారందరినీ చూసి ఆవేద నకు లోనైన ఎమ్మెల్యే... ఇంతమంది మహి ళలు ఒంటరిగా ఉన్నారా అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. తల్లిదండ్రులకు సైతం కుమారులు అన్నం పెట్టలేని దుస్థితిలో సమాజం ఉందని, ఒంటరిగా జీవించే మహిళలు అనేక ఛీత్కారాలకు గురవుతుం డడం విచారకరమని అన్నారు.