'ఆ డబ్బులు ఎక్కడ నుంచి వచ్చాయ్‌' | MIM MLA Akbaruddin Owaisi Speech In Telangana Assembly | Sakshi
Sakshi News home page

'ఆ డబ్బులు ఎక్కడ నుంచి వచ్చాయ్‌'

Dec 16 2016 2:52 PM | Updated on Sep 4 2017 10:53 PM

'ఆ డబ్బులు ఎక్కడ నుంచి వచ్చాయ్‌'

'ఆ డబ్బులు ఎక్కడ నుంచి వచ్చాయ్‌'

అవినీతికి వ్యతిరేకంగా పోరాడాలనుకుంటే ముందుగా ఎన్నికలన్నారు ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ

హైదరాబాద్‌: అవినీతికి వ్యతిరేకంగా పోరాడాలనుకుంటే ముందుగా ఎన్నికల ఖర్చును తగ్గించుకోవాలని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీజేపీలు రూ. 5 వేల కోట్లకు పైగా ఖర్చు చేశాయని, ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు.

పెద్ద నోట్ల రద్దుతో టెర్రరిజం అదుపులోకి వస్తుందని చెప్పారని అయితే అలాంటిదేమీ జరగలేదని ఆక్బరుద్దీన్‌ ఒవైసీ అన్నారు. 'ఇప్పటికే బ్యాంకుల్లో 13 లక్షల కోట్లు డిపాజిట్‌ అయ్యాయి. ఆయా బ్యాంకుల వద్ద రూ. 4 లక్షల కోట్ల పైచిలుకు కరెన్సీ ఉంది. రూ. 17 లక్షల కోట్లు లెక్క తేలాక ఇక బ్లాక్‌ మనీ ఎక్కడుంది' అని ఆయన ప్రశ్నించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement