పాలపై లీటరుకు రూ. 2 వడ్డింపు | Milk price hiked with Rs. 2 per litre | Sakshi
Sakshi News home page

పాలపై లీటరుకు రూ. 2 వడ్డింపు

Sep 4 2013 1:38 AM | Updated on Aug 18 2018 6:18 PM

మరో రెండు రోజుల్లో ‘ఏపీ డెయిరీ’ పాల విక్రయ ధరను లీటరుకు రూ.2 పెంచనున్నట్లు సమాచారం.

సాక్షి, హైదరాబాద్: మరో రెండు రోజుల్లో ‘ఏపీ డెయిరీ’ పాల విక్రయ ధరను లీటరుకు రూ.2 పెంచనున్నట్లు సమాచారం. ఏపీ డెయిరీ రోజుకు దాదాపు 4.5 లక్షల లీటర్ల పాలు విక్రయిస్తోంది. హైదరాబాద్‌లోనే 3.75 లక్షల లీటర్ల పాలను అమ్ముతోంది. లీటరుకు రెండు రూపాయల చొప్పున రోజుకు రూ.9 లక్షలు, నెలకు రూ.27 కోట్ల భారం వినియోగదారులపై మోపేందుకు ఏపీ డెయిరీ రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. కాగా పాల సేకరణ ధరను పెంచుతున్నట్లు ఏపీ డెయిరీ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement