‘ఎగ్జిట్‌’కు నిరసనగా వైద్యవిద్యార్థుల ర్యాలీ | Sakshi
Sakshi News home page

‘ఎగ్జిట్‌’కు నిరసనగా వైద్యవిద్యార్థుల ర్యాలీ

Published Wed, Feb 1 2017 12:31 PM

Med students to protest against exit exam

హైదరాబాద్‌: వైద్య విద్య పూర్తి చేసిన వారు ‘ఎగ్జిట్‌’ రాయాలని పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని మెడికల్‌ విద్యార్థులు వ్యతిరేకిస్తున్నారు. వైద్య పూర్తి చేసిన వారు వైద్యులుగా ప్రాక్టీసు ప్రారంబించేందుకు గతంలో మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా అనుమతించేది. అయితే దాన్ని ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం రద్దుచేసి నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ను అమలులోకి తెచ్చింది. వైద్య విద్య పూర్తి చేసిన వారు ‘ఎగ్జిట్‌’  అనే పరీక్ష రాస్తేనే ప్రాక్టీసుకు అనుమతించాలని కేంద్రం నిర్ణయించడంతో ఎల్లకాలం పరీక్షలు రాస్తూ కూర్చుంటే ప్రాక్టీసు ఎప్పుడు చేసుకుంటామంటూ విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. దీనివల్ల తాము నష్టపోతామంటున్నారు. అలాగే సర్వీసు కోటా కింద పీజీలో 50 శాతం సీట్లు పెంచాలన్న నిర్ణయాన్ని కూడా వవ్యతిరేకిస్తున్నారు. వీరికి ఐఎంఏ కూడా మద్దతు పలికింది. సుమారు 600 మంది వైద్య విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు.
 
కాగా సికింద్రాబాద్‌లో గాంధీ ఆస్పత్రి మెడికల్‌ విద్యార్థులు కూడా ఐఎంఏ తెలంగాణ స్టేట్‌ బ్రాంచి ఆధ్వర్యంలో ‘ఎగ్జిట్‌’కు వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు. కరీంనగర్‌లో కలెక్టరేట్‌ గేటు ముందు మెడికల్‌ విద్యార్థులు మానవహారం చేపట్టారు. కాగా, హైదరాబాద్‌ ఎల్‌బీనగర్‌లోని కామినేని ఆస్పత్రి వైద్య విద్యార్థులు కూడా తరగతులు బహిష్కరించి భారీ ర్యాలీ చేపట్టారు.

Advertisement
Advertisement