వినియోగదారుల చట్టం పరిధిలోకి మార్కెట్‌ కమిటీలు | Market Committees into Under the Consumer Protection | Sakshi
Sakshi News home page

వినియోగదారుల చట్టం పరిధిలోకి మార్కెట్‌ కమిటీలు

Mar 9 2017 2:39 AM | Updated on Mar 23 2019 8:59 PM

కొనుగోలుదారులు, రైతుల నుంచి రుసుము వసూలు చేసి సేవలందిస్తున్న వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు వినియోగదారుల పరిరక్షణ చట్టం పరిధిలోకి

ఏపీ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ తీర్పు

సాక్షి, హైదరాబాద్‌: కొనుగోలుదారులు, రైతుల నుంచి రుసుము వసూలు చేసి సేవలందిస్తున్న వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు వినియోగదారుల పరిరక్షణ చట్టం పరిధిలోకి వస్తాయని ఏపీ రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ తేల్చి చెప్పింది. సౌకర్యాలేవీ ఉచితంగా కల్పించడంలేదని, క్విడ్‌ప్రోకో తరహాలో సేవలకు ఫీజు వసూలు చేస్తున్న నేపథ్యంలో కమిటీలు ఈ చట్టపరిధి లోకి వస్తాయని స్పష్టం చేసింది. ఏపీ మార్కెట్‌ చట్టం (వ్యవసాయ ఉత్పత్తులు, పశు సంపద)లోని సెక్షన్‌ 14 కింద వసూలైన ఫీజు సొమ్మును మార్కెట్‌ కమిటీ ఫండ్‌కు జమ చేయాలన్నారు. సెక్షన్‌ 15 ప్రకారం మార్కెట్‌ ఏర్పాటుకు భూమి కొనుగోలు, నిర్మాణాలు, నిర్వహణ సహా ఇతర సౌకర్యాల కల్పనకు కమిటీ ఫండ్‌ నుంచే డబ్బును ఖర్చు చేయాలన్నారు. ఈ నేపథ్యంలో మార్కెట్‌ కమిటీలు వినియోగదారుల రక్షణ చట్టం పరిధిలోకి వస్తాయన్నారు. ఈ మేరకు కమిషన్‌ అధ్యక్షుడు జస్టిస్‌ నౌషద్‌ అలీ బుధవారం తీర్పునిచ్చారు.

అప్పీలు కొట్టివేస్తూ తీర్పు...
తమకు వినియోగదారుల రక్షణ చట్టం వర్తించదంటూ కృష్ణా జిల్లా మార్కెటింగ్‌ రీజినల్‌ డైరెక్టర్, గుంటూరు సహాయ డైరెక్టర్, తెనాలి మార్కెట్‌ కమిటీ సెలక్షన్‌ గ్రేడ్‌ కార్యదర్శి దాఖలు చేసిన అప్పీల్‌ను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement