'నయీంతో నాకెలాంటి సంబంధాలు లేవు' | manchireddy kishanreddy fires on malreddy rangareddy | Sakshi
Sakshi News home page

'నయీంతో నాకెలాంటి సంబంధాలు లేవు'

Sep 4 2016 5:43 PM | Updated on Oct 16 2018 9:08 PM

'నయీంతో నాకెలాంటి సంబంధాలు లేవు' - Sakshi

'నయీంతో నాకెలాంటి సంబంధాలు లేవు'

మల్‌రెడ్డి రంగారెడ్డి ఆరోపణలు నిరాధారమైనవని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు.

హైదరాబాద్‌: మల్‌రెడ్డి రంగారెడ్డి తనపై చేసిన ఆరోపణలు నిరాధారమైనవని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. దమ్ముంటే తనపై చేసిన ఆరోపణలు రుజువు చేయాలని కిషన్‌రెడ్డి సవాలు విసిరారు. రాజకీయ లబ్దికోసమే మల్‌రెడ్డి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. గ్యాంగ్స్టర్ నయీంతో తనకెలాంటి సంబంధాలు లేవని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.

కాగా, అంతకుముందు మల్‌రెడ్డి రంగారెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ..మంచిరెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నయీం ప్రధాన అనుచరుడు శ్రీహరితో కలిసి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి భారీగా అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు.
 
నయీం కేసులో శ్రీహరిని అరెస్ట్ చేసిన పోలీసులు మంచిరెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదని రంగారెడ్డి ప్రశ్నించారు. శ్రీహరితో కలిసి ఎమ్మెల్యే రూ.300 కోట్లు సంపాదించాడని ఆయన ఆరోపించారు. ఆదిభట్లలోని భూ కబ్జా విషయాలు బయటకొస్తాయనే భయంతోనే మంచిరెడ్డి పార్టీ మారారన్నారు. ఎమ్మెల్యే అవినీతిపై ఇబ్రహీంపట్నం చౌరస్తాలో బహిరంగ చర్చకు సిద్ధమని రంగారెడ్డి సవాల్ విసిరారు.

Advertisement
 
Advertisement
Advertisement