బంగారు ఆభరణాల బ్యాగు మాయం | Man loses bag containing jewellery | Sakshi
Sakshi News home page

బంగారు ఆభరణాల బ్యాగు మాయం

Apr 18 2016 3:15 PM | Updated on Sep 3 2017 10:11 PM

నగరంలో ఓ వివాహ కార్యక్రమానికి హాజరైన వ్యక్తి బంగారు ఆభరణాల బ్యాగు పోగొట్టుకున్నాడు. దీనిపై చైతన్యపురి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

హైదరాబాద్ : నగరంలో ఓ వివాహ కార్యక్రమానికి హాజరైన వ్యక్తి బంగారు ఆభరణాల బ్యాగు పోగొట్టుకున్నాడు. దీనిపై చైతన్యపురి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసుల కథనం మేరకు.. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామానికి చెందిన నగేష్‌బాబు (48) నగరంలో సోమవారం ఓ వివాహ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చాడు. 
 
చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని బృందావన్ లాడ్జిలో గది అద్దెకు తీసుకున్నాడు. ఆటోలో లాడ్జి నుంచి సికింద్రాబాద్‌కు వెళుతున్న అతడు వెంట తెచ్చుకున్న 25 తులాల బంగారు ఆభరణాల బ్యాగు కనిపించకపోయేసరికి కంగారుతో పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement