వీధికుక్కను చంపిన వ్యక్తిపై కేసు నమోదు | Man charged in killing of street dog | Sakshi
Sakshi News home page

వీధికుక్కను చంపిన వ్యక్తిపై కేసు నమోదు

Mar 24 2016 11:03 PM | Updated on Sep 3 2017 8:29 PM

వీధికుక్కను చంపిన వ్యక్తిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన సంఘటన కాచిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం జరిగింది.

హైదరాబాద్‌సిటీ: వీధికుక్కను చంపిన వ్యక్తిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన సంఘటన కాచిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం జరిగింది. ఎస్‌ఐ జయన్న తెలిపిన వివరాల ప్రకారం..బర్కత్‌పురా భూమన్న లేన్‌లో ఇందిరాభవన్ అపార్ట్‌మెంట్ వాచ్‌మన్ శరత్(35) తన పిల్లల్ని తీసుకుని బయటకు రాగానే రోడ్డుపైన ఉన్న ఓ వీధికుక్క పిల్లల్ని చూసి మొరగడం ప్రారంభించింది. కుక్క కరస్తుందనే భయంతో వాచ్‌మన్ కుక్కను కొట్టాడు.

దీంతో ఆ కుక్క చనిపోయింది. హైకోర్టు అడ్వోకేట్ శ్రేయ పరోపకారి ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లి కాచిగూడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. శరత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని కుక్క మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement