
కేసీఆర్ వైదొలగాలి: భట్టి
చట్ట వ్యతిరేకంగా జారీ చేసిన జీవో 123ని కోర్టు కొట్టివేసినందుకు సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు.
సాక్షి, హైదరాబాద్: చట్ట వ్యతిరేకంగా జారీ చేసిన జీవో 123ని కోర్టు కొట్టివేసినందుకు సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. గాంధీభవన్‌లో గురువారం ఆయన మాట్లాడుతూ, హైకోర్టు వేసిన మొట్టికాయల నేపథ్యంలో సీఎంకు అవగాహన లేదని మరోసారి రుజువైందన్నారు. కాంగ్రెస్ పార్టీ తెచ్చిన భూ సేకరణ చట్టం-2013 ప్రకారం పునరావాస చర్యలు తీసుకోవాలని పోరాడినా రాష్ట్రప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. జీవో 123 జారీ చేయడానికి బాధ్యులైన వారంతా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తీర్పు రాగానే భూ నిర్వాసితులు, ఆయా గ్రామాల ప్రజలు సంబురాలు జరుపుకున్నారని, ఇది నిర్వాసిత గ్రామాల వ్యతిరేకతకు నిదర్శనమని చెప్పారు.