ఆరోగ్యశ్రీ అనారోగ్యశ్రీగా మారింది | Madhuyaski Goud comments on Aarogyasri | Sakshi
Sakshi News home page

ఆరోగ్యశ్రీ అనారోగ్యశ్రీగా మారింది

Oct 6 2016 3:42 AM | Updated on Oct 8 2018 3:39 PM

ఆరోగ్యశ్రీ అనారోగ్యశ్రీగా మారింది - Sakshi

ఆరోగ్యశ్రీ అనారోగ్యశ్రీగా మారింది

రాష్ట్రంలో పేద ప్రజలకు సర్కారు వైద్యం అందక తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారని, ఆరోగ్యశ్రీ కాస్త అనారోగ్యశ్రీగా మారిందని కాంగ్రెస్ మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ ఆరోపించారు.

మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ ఆరోపణ

 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పేద ప్రజలకు సర్కారు వైద్యం అందక తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారని, ఆరోగ్యశ్రీ కాస్త అనారోగ్యశ్రీగా మారిందని కాంగ్రెస్ మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ ఆరోపించారు. గాంధీభవన్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ హయాంలో ఏర్పాటుచేసిన 108, 104 లను సీఎం కేసీఆర్ పూర్తిగా నిర్వీర్యం చేశారన్నారు. వేలాది మంది పేద ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు.

మండలానికొక ఆస్పత్రి, నియోజకవర్గానికొక సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి చొప్పున నిర్మిస్తామని మేనిఫెస్టోలో పెట్టిన ప్రకటన ఏమైందని ప్రశ్నించారు. కార్పొరేట్ ఆస్పత్రులకు పెద్దపీట వేసి, ప్రభుత్వ ఆస్పత్రులను నిర్వీర్యం చేస్తున్నారని దుయ్యబట్టారు. నగరంలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో ఎంపీ కల్వకుంట్ల కవిత వాటా ఎంతో చెప్పాలని ప్రశ్నించారు. కేసీఆర్ పాలన నిజాం పాలనను తలపిస్తోందన్నారు. బెదిరింపుల ధోరణితో విపక్షాల నోరు నొక్కుతున్నారని వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement