హైదరాబాద్ నగరంలో శుక్రవారం సాయంత్రం భారీ ఎత్తున పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి.
హైదరాబాద్: నగరంలోని ప్రముఖ పారిశ్రామిక కేంద్రం నాచారం వద్ద భారీ ఎత్తున పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి. శుక్రవారం సాయంత్రం నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లాపూర్ లో ఎన్ఎస్ ఈ బ్రిడ్జి వద్ద 400 డిటోనేటర్లు, 550 జెలిటిన్ స్టిక్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటనకు సంబంధం ఉన్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు. ఇప్పటికే ఉగ్రవాదుల టార్గెట్ గా మారిన హైదరాబాద్ నగరంలో ఇంత భారీ ఎత్తున పేలుడు పదార్థాలు లభ్యం కావడం సర్వత్రా ఆందోళన రేకెత్తిస్తున్నది.