తెలంగాణ పోరాటయోధుడు కొమురం భీం 76వ వర్థంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించనున్నట్లు గిరిజన ఐక్య వేదిక ప్రెసిడెంట్ వివేక్ వినాయక్ తెలిపారు.
తెలంగాణ పోరాటయోధుడు కొమురం భీం 76వ వర్థంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించనున్నట్లు గిరిజన ఐక్య వేదిక ప్రెసిడెంట్ వివేక్ వినాయక్ తెలిపారు. ఈ నెల 16న ఉదయం ట్యాంక్‌బండ్‌పై ఉన్న కొమురం భీం విగ్ర హం వద్ద జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. ప్రత్యేక ఆహ్వానితులుగా ఎ.చందూలాల్, డాక్టర్ కేవీ రమణాచారి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ పాల్గొంటారని వెల్లడించారు. ఈ సందర్భంగా గిరిజన కళాకారుల ఆటాపాట ఉంటాయని తెలిపారు.