స్పీకర్ రేసులో కోడెల! | Kodela Siva Prasad Rao in Race for Speaker's Post ! | Sakshi
Sakshi News home page

స్పీకర్ రేసులో కోడెల!

Jun 19 2014 3:24 PM | Updated on Jul 29 2019 2:44 PM

స్పీకర్ రేసులో కోడెల! - Sakshi

స్పీకర్ రేసులో కోడెల!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ ఎంపిక ప్రక్రియకు గురువారం నోటిఫికేషన్ విడుదలైంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ ఎంపిక ప్రక్రియకు గురువారం నోటిఫికేషన్ విడుదలైంది. స్పీకర్ పదవికి రేపు సాయంత్రం 5.00 గంటలలోపు నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంది. అయితే రాష్ట్రంలో ఆధికారంలో ఉన్న టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, కోడెల శివప్రసాదరావు స్పీకర్ బరిలో ఉన్నట్లు ఊహాగానాలు ఊపందుకున్నాయి.

 

మరికాసేపట్లో కోడెల స్పీకర్ పదవికి నామినేషన్ దాఖలు చేసే అవకాశాలున్నాయని సమాచారం. కోడెల శివప్రసాదరావు ఇప్పటి వరకు ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే గుంటూరు జిల్లా నరసరావుపేట నుంచి ఐదు సార్లు గెలుపొందగా, 2014లో జరిగిన ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి కోడెల విజయం సాధించారు. గతంలో కోడెల శివప్రసాద్ ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రిగా పని చేసిన సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement