కేంద్ర మంత్రికి తప్పిన ప్రమాదం | JP nadda narrowly nissed from a incident | Sakshi
Sakshi News home page

కేంద్ర మంత్రికి తప్పిన ప్రమాదం

Apr 22 2016 6:40 PM | Updated on Mar 29 2019 5:57 PM

కేంద్ర మంత్రికి తప్పిన ప్రమాదం - Sakshi

కేంద్ర మంత్రికి తప్పిన ప్రమాదం

బీజేపీ కార్యాలయంలో కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు తృటిలో పెను ప్రమాదం తప్పింది.

హైదరాబాద్: బీజేపీ కార్యాలయంలో కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. దీంతో బీజేపీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు.  ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి కేంద్ర మంత్రి జేపీ నడ్డా హైదరాబాద్ కు వచ్చిన విషయం తెలిసిందే. శుక్రవారం సాయంత్రం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో నుంచి బయటకు వస్తుండగా.. ఆయన ఉన్న లిఫ్ట్ తీగ తెగింది. దీంతో మొదటి అంతస్థులో ఉన్న లిఫ్ట్ ఒక్కసారిగా గ్రౌండ్ ఫ్లోర్ లో పడింది. ఆ సమయంలో ఆయనతో పాటు రాష్ట్ర నాయకులు ఎమ్మెల్యే ప్రభాకర్, ఎమ్మెల్సీ రాంచందర్ రావు ఉన్నారు. సామర్థ్యానికి మించి బరువు వేయడంతోటే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement