ప్రభుత్వం నడిపిస్తున్న 'మన టీవీ' ద్వారా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువకులకు ఉపయోగపడే కార్యక్రమాలు రూపొందించాలని అధికారులను ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ ఆదేశించారు.
- ఐటీ శాఖా మంత్రి కేటీఆర్
హైదరాబాద్: ప్రభుత్వం నడిపిస్తున్న 'మన టీవీ' ద్వారా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువకులకు ఉపయోగపడే కార్యక్రమాలు రూపొందించాలని అధికారులను ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ ఆదేశించారు. రైతులకు, గృహిణులకు ఉపయుక్తంగా ఉండేలా కార్యక్రమాలుండాలని సూచించారు. ఈ మేరకు ఆదివారం మంత్రి ప్రకటన విడుదల చేశారు.
పూర్తి స్థాయిలో పునరుద్ధరిస్తున్న మనటీవీకి కొత్త పేరు, లోగోను సూచించాలని సీఈఓ శైలేష్‌రెడ్డి కోరారు. మంచి పేరు, లోగో సూచించిన వారికి రూ.51 వేల బహుమతి అందిస్తామని ప్రకటించారు. పేరు, లోగోలను ఐటీ శాఖ వెట్‌సైట్‌లో లేదా అంబేడ్కర్ ఓపెన్ యూనివర్శిటీ ప్రాంగణంలోని మనటీవీ కార్యాలయంలో నేరుగా కానీ, పోస్టు ద్వారా కానీ సమర్పించవచ్చని తెలిపారు.